Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎంఆర్ హౌల్డింగ్స్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఎంఆర్ వినరు ఐనానియా వద్ద హమిల్టన్, లోగన్, శివాలిక్ టవర్లను ముందుగానే ప్రారంభిస్తున్నట్టు ఎస్ఎంఆర్ హౌల్డింగ్స్ తెలిపింది. ఈ మేరకు గురువారం హౌల్డింగ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్ట్‌కు పక్కన అత్యాధునిక హాస్పిటల్ మరియు బొటిక్ మాల్‌ను నిర్మించనున్నారు. మూడు టవర్లలో హమిల్టన్ (80 శాతం పూర్తయింది), లోగన్ (60 శాతం పూర్తయింది), శివాలిక్ (30 శాతం పూర్తయింది) ఉన్నాయి. ఈ మూడూ ఎస్ఎంఆర్ వినరు ఐకానియా-అర్బన్ రిట్రీట్ వద్ద ఉన్నాయి. కుటుంబాల కోసం కోసం అత్యంత ఆహ్లాదకరమైన గృహాలను ఇవి అందించనున్నాయి. వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్ట్ కొండాపూర్, గచ్చిబౌలి వద్ద ఉంది. ఈ ప్రాజెక్ట్ 22 ఎకరాలలో 11 టవర్లతో విస్తరించి ఉంది.
నాణ్యమైన పనితనాన్ని ఎస్ఎంఆర్ వినరు ఐకానియా అందిస్తుంది. అత్యుత్తమ మెటీరియల్స్ వినియోగించుకోవడంతో పాటుగా అత్యాధునిక సాంకేతికత, సృజనాత్మక డిజైన్ మరియు ప్రాంగణాలను అత్యంత నైపుణ్యంగా వినియోగించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్‌లో ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, స్ఫూర్తిదాయక ఎలివేషన్స్, తగినంతగా సహజసిద్ధమైన కాంతి వంటివి దీనిని నిర్మాణాపరంగా అద్భుతంగా మలుస్తాయి. ఈ ప్రాజెక్ట్, తమ నివాసితులకు సౌకర్యవంతమైన జీవనశైలికి వాగ్ధానం చేస్తుంది. దీనిలో క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, అల్టా మోడ్రన్ జిమ్నాషియం, మినీ క్రికెట్ గ్రౌండ్, టెన్నీస్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్ , ఇండోర్ బాడ్మింటన్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు , అత్యున్నత శ్రేణి సింథటిక్ టర్ఫ్‌తో జాగింగ్ ట్రాక్, విస్తృతశ్రేణి పార్కింగ్స్పేస్ వంటి వసతులెన్నో ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ హౌల్డింగ్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రామ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత చురుకైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో రెండవదిగా హైదరాబాద్ మార్కెట్ నిలిచిందని తెలిపారు.