Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్‌కు టిప్స్ నోటీసు
నవతెలంగా బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను పంపడంలో నిర్లక్ష్యానికి నిరసనగా శనివారం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త ఎం జంగయ్య, నాయకులు కెపి శోభన్‌బాబు, ఎం శ్రీనివాస్‌రెడ్డి కలిసి నోటీసు అందజేశారు.