Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అక్రమ ఆస్తుల పేరుతో ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బ తీయటం సరికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, ముత్యాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయటం మానుకోవాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా పాలమాకుల మోడల్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా పనిచేస్తున్న శారదను రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) లోకి సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా పూర్తిస్థాయి బదిలీపై ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. టీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్ రెడ్డిని నల్లగొండ నుంచి రంగారెడ్డికి బదిలీ చేశారని పేర్కొన్నారు.
బదిలీలు నిలిపివేయాలి : డీటీఎఫ్
నిబంధనలకు విరుద్ధంగా,దొడ్డిదారిన ఇతర జిల్లాలనుంచి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చేస్తున్న అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డీటీఎఫ్్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘుశంకర్ రెడ్డి, టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 317 జీవో ద్వారా నష్టపోయిన వేలాదిమంది ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.