Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామినేషన్ కార్యక్రమానికి నేడు కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న టీఆర్ఎస్...రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు బలపరుస్తున్న యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి. సురేష్ రెడ్డి , బిబిపాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్ రెడ్డిలు కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.