Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- రైతు సంఘం ఆధ్వర్యంలో నీటిపారుదల
శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నడిపించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నీటిపారుదల చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన నిధులను యుద్ధప్రాతిపదికన కేటాయించి లిఫ్టులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. సివిల్ వర్క్స్, బావుల పూడికలు, కాల్వల పూడికలు, తూములు, షట్టర్స్, కాల్వకట్టలు, రహదారులు పూర్తిచేసి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని చెప్పారు. ఎలక్ట్రికల్ వర్క్స్ మోటార్లు, ప్యానల్బోర్డ్స్, ట్రాన్స్ఫారాలు, పంపులు, వ్యాకింగ్ పంపుల రిపేర్లు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. లిఫ్టుల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి.. సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టుల నిర్వహణ బాధ్యత ఐడీసీకిి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకమైన లైన్ల వెంట ఉన్న కంపచెట్లను తొలగించి బ్రోకెన్ ఫోల్స్ వేయాలని చెప్పారు. అనంతరం నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్‌రెడ్డి, నాగిరెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీనివాసులు, నాయకులు కుంభం కృష్ణారెడ్డి, తెలకొంగ సత్యనారాయణ, పాదూరి గోవర్ధన్, శశిధర్, లిఫ్టు చైర్మెన్లు, సోమేశ్వర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.