Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలు, మహిళల్లో పోషకాహార లేమి
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- జులై 4న ఇందిరాపార్కు వద్ద ధర్నా జయప్రదానికి పిలుపు
నవతెలంగాణ - భువనగిరి
తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల నుంచి కొత్త రేషన్ కార్డుగానీ, వద్ధాప్య పింఛన్లుగానీ ఇవ్వలేదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది దరఖాస్తులు పెట్టుకున్నా నేటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్ల కోసం జులై 4న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని బహదూర్పేట్ వార్డులో పర్యటించారు. మహిళల సమస్యలు తెలుసుకున్నారు. ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మల్లు లకిë మాట్లాడుతూ.. ఏ కార్యాలయానికి వెళ్లినా, స్కూల్లో పిల్లలను జాయిన్ చేయాలన్నా రేషన్ కార్డులు అడుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వమేమో కొత్తగా ఒక్కటీ ఇవ్వడం లేదన్నారు. ఒకపక్క ధరలు పెరుగుతున్నాయని, మరోపక్క మహిళలు, పిల్లలు పోషకాహార లేమితో ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో రేషన్ షాపుల ద్వారా కుటుంబానికి 14 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రెండేండ్ల లోపు పిల్లలు 89 శాతం మంది పోషకాహార లేమితో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. అభయ హస్తం నిధులు వెంటనే విడుదల చేసి పొదుపు మహిళల అకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు అవ్వారు రామేశ్వరి, కోశాధికారి కల్లూరి నాగమణి, నాయకులు దండు స్వరూప, భావన పావని, జయశ్రీ పాల్గొన్నారు.