Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటర్ ఫలితాల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు మంత్రితో పాటు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో మంత్రి మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు. గురుకులాలకు చెందిన మొదటి సంవత్సర విద్యార్థులు 88.03 శాతం ఉత్తీర్ణులు కాగా,రాష్ట్రంలో సరాసరి 64.25 మాత్రమేన న్నారు.మొదటి సంవత్సర పరీక్షలకు 11,999 మంది విద్యార్థులు హాజరు కాగా,వీరిలో 10,563 మంది పాసయ్యారని తెలిపారు. 17కళాశాలలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయన్నా రు.ద్వితీయ సంవత్సరంలో సరాసరి 68.68శాతం కాగా, సొసైటీకి చెందిన విద్యార్థులు 93.23శాతం మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. పరీక్షలకు 11,456మంది హాజరు కాగా,వీరిలో 10,680మంది పాసయ్యారన్నారు.41కళాశాలలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.ఈ మేరకు విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్ష లు తెలిపారు,అధికారులు, అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు.