Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎంసీ చైర్మెన్‌కు హెచ్ఆర్డీఏ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అర్హత లేకున్నా పేర్ల ముందు డాక్టర్ అని పెట్టుకుని, రోగులకు షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను ప్రిస్క్రైబ్ చేస్తున్న నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ టీఎస్ఎంసీ చైర్మెన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మేడ్చల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో నకిలీ వైద్యులు చట్టవిరుద్ధంగా చేస్తున్న ప్రాక్టీస్ తాలుకూ రుజువులతో కూడిన ప్రిస్క్రిప్షన్ పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు.