Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వేసిన ఎలక్షన్ పిటిషన్‌ను కొట్టేయాలని ఈశ్వర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. 2018, డిసెంబర్లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ధర్మపురి నుంచి లక్ష్మణ్‌పై ఈశ్వర్ 440 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వీవీ ప్యాట్లను కౌంటింగ్ చేయకుండానే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని ప్రకటించడం చెల్లదనీ, తాను గెలిచినట్టుగా ప్రకటించాలని లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో లక్ష్మణ్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి.