Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట ప్రకారం అర్హులకు పట్టాలివ్వండి
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విత్తనాలు వేసుకునేందుకు పొలాల్లోకి వెళితే పోడుసాగుదారులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం ఆవేదన వ్యక్తంచేసింది. పోడు రైతులపై దాడులు ఆపాలనీ, 2006 ఆటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలివ్వాలని డిమాండ్ చేసింది. ఈమేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో రైతులపై దాడులు నిర్వహించడాన్ని ఖండించారు. రైతులు ధరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు పూర్తయిందనీ,ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వహామీమేరకు 3.5 లక్షల మంది అర్హుల ధరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ రాతపూర్వక ఆదేశాలు లేకుండా భూమిలోకి ఫారెస్టు అధికారులు రాకూడదనీ, కానీ అనేక జిల్లాల్లో రైతులపై దాడులు కొనసాగిస్తున్నారని తెలిపారు. సాగుదారులు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. అక్రమ కేసులు, నిర్భంధఖాండకు స్వస్తి చెప్పి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము.లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తంన్నాం.