Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కరోనా సమయంలో నిలిపి వేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్ధరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) నేతలు కేంద్ర పర్యాటక మంత్రి జి. కిషన్‌రెడ్డిని కోరారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.జగదీష్ మంగళవారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అక్రిడిటేషన్ కార్డులున్న జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్లో ప్రయాణించేందుకు రైలుచార్జీలో యాభై శాతం రాయితీ కల్పిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వే బోర్డు చాలా ఏండ్లుగా ఇస్తున్న పాస్‌లను 2020లో కరోనా పేరుతో తాత్కాలికంగా రద్దు చేశారనీ, ఫలితంగా వేలాది మంది జర్నలిస్టులకు రైల్లో ప్రయాణం భారంగా మారిందని వారు మంత్రికి విన్నవించారు. ఈ విషయాన్ని ఇటీవల తాము దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దష్టికి కూడా తీసుకువెళ్ళి జర్నలిస్టుల రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలని కోరినట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. మా విజ్ఞప్తి మేరకు సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కేంద్ర రైల్వే బోర్డుకు లేఖ రాసినప్పటికీ ఇంత వరకు రాయితీ పాస్‌ల పునరుద్ధరణ జరగలేదని మంత్రికి వివరించారు. ఈ సమస్యను రైల్వేబోర్డు దష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ తప్పకుండా ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు దష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులకు రాయితీ పాస్‌లను పునరుద్ధరించేందుకు కషి చేస్తానని హామీ ఇచ్చారు.