Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతకు జూలూరు గౌరీశంకర్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నేటి యువత ఆంగ్లమాధ్యమంలోనే చదువుతూ...తెలుగు భాషకు దూరమవుతున్న నేపథ్యంలో ఒక విదేశీయురాలు తెలుగు భాష మీద ఇష్టంతో సొంతంగా తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవడం గొప్ప విషయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు.యుఎస్‌కు చెందిన బ్రీ అనే ఆవిడ తెలుగు భాషకు చేస్తున్న కృషిని గుర్తించిన గౌరీశంకర్ ఆమెను రవీంద్రభారతికి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కని నుడికారాలతో, పలుకులతో తేనే కంటే మధురంగా ఉన్న తెలుగు భాష మనదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో సైతం ఎంతో ప్రాచుర్యం పొందుతుందన్నారు.మన భాషను నేర్చుకోవడానికి ఎంతోమంది విదేశీయులు తహతహలాడుతున్నారన్న దానికి ఈ అమ్మాయియే నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ పాల్గొన్నారు.