Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని యూనియవర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎ.పరశురామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ డి.ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీఎం కేసీఆర్... రెగ్యులరైజ్ చేస్తామంటూ హామీనిచ్చారని గుర్తుచేశారు. 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 980 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేశారని తెలిపారు. అదే విధంగా తమ సేవలను కూడా క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.