Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తీస్తా సెతల్వాద్, మాజీ ఐపీఎస్ అధికారులు ఆర్బీ శ్రీకుమార్, సంజీవ్భట్ను వెంటనే విడుదల చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద పార్టీ నేతలతో కలిసి ఇదే అంశంపై నిరసన తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.సీబీఐ, ఇడి, ఐటీ, ఏటీఎస్ వంటి ముఖ్యమైన సంస్థలు బీజేపీకి అనుబంధ సంఘాలు గా మారిపోయాయని జడ్సన్ ఈ సందర్భంగా ఆరో పించారు. ప్రజా స్వామ్యవాదులను భయబ్రాంతు ల కు గురి చేసేందుకే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. సిట్ అధికారి రాఘవన్ 2002లో గుజరాత్లో జరిగిన 1200 మంది హత్యాకాండలో మోడీ పేరు ఉన్నట్టు సాక్ష్యాలు లేవని రిపోర్ట్ ఇచ్చినందుకు నజరానాగా సైపృన్ రిప్లబిక్ దేశానికి అంబాసిడర్‌గా నియమించారని ఆరోపించారు. గుజరాత్ అధికారు లకు హత్యాకాండతో సంబంధం ఉందంటూ జస్టీస్ కృష్ణ అయ్యర్ సిటిజెన్ కమిషన్‌లో అనేక మంది సాక్ష్యం చెప్పారని గుర్తు చేశారు. రానా అయూబ్ అనే ప్రముఖ జర్నలిస్ట్ తన పుస్తకం గుజ రాత్ ఫైల్స్‌లో హిడెన్ కెమెరాతో సేకరించిన సాక్షాల ను తన పుస్తకంలో చేర్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మా షాకీర్, నాయకులు దుగ్యాల వేణు, సుధాకర్, గిరి బాబు, అర్షిద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.