Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులను రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. బుధ వారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ కార్పొరేట్ విద్యను తలదన్నేలా గురుకులాల్లో విద్య అందుతుందనడానికి విద్యార్థులు సాధించిన అద్భుతమైన ఫలితాలే ఉదాహరణ అని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.25 వేల రూపాయల చెక్కును, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.15 వేల నగదు ప్రోత్సాహాకాన్ని మంత్రి అందించారు. అనంతరం గిరిజనుల ద్వారా సేకరించి ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా ముడి తేనేను ఆమె మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ చైర్మెన్ రమావత్ వాల్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.