Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్వీనర్ వి సత్యనారాయణ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 15 వరకు దరఖాస్తు గడువును పొడిగించామని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 22 నుంచి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆటస్థలంలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇతర వివరాలకు https://pecet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. ఇప్పటి వరకు బీపీఈడీకి 1,262, డీపీఈడీకి 913 కలిపి 2,175 దరఖాస్తులొచ్చాయని వివరించారు.