Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకులాలు దేశానికే ఆదర్శమని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణ, సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతునాయక్, అధికారులు ప్రవీణ్ కుమార్, శక్రు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలు సాధిస్తున్న విజయాలు, ఫలితాలు గర్వకారణమని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ వీటిని నెలకొల్పారని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న విధంగా గురుకులాలు దేశంలో మరెక్కడా లేవనీ, ఐదు సొసై టీల ఆధ్వర్యంలో 990 పాఠ శాలలు సాగుతున్నాయని తెలిపారు. గురుకులాల విద్యా ర్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో గొప్పగా రాణించడం సంతోషంగా ఉందన్నారు. కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఇవి ముందుకు సాగు తున్నాయని మంత్రి వివరిం చారు. ఈ విద్యా సంవత్సరంలో 75 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామనీ, షేక్ పేట, చిలుకూరు బాలు ర,నార్సింగి, మహేంద్రహిల్స్ బాలికల స్కూళ్లను గౌలిదొడ్డి పాఠశాల మాదిరిగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దు తామని వివరించారు.ఈ సందర్భంగా 28 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు.