Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కమిటీ అన్ ఇన్పర్మెషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలాజీ రాజ్యసభ కమిటీ చైర్మెన్ రాకేష్ సిన్హా, ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఢిల్లీ ప్రతినిధులకు పుష్పగుచ్చం అందజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా కమ్యూనికేషన్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహచార్యులు, ఇతర అధికారులు ఉన్నారు.
మేమూ క్షేమం : గుత్తా
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కారక్రమాలు ముగించుకుని నల్లగొండ వెళుతుండగా రామోజీ ఫిల్మ్‌సిటీకి దగ్గరలో గేదెలు అడ్డురావడం వల్ల ఒక ప్రయివేటు వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో నా కాన్వాయిలోని వాహనాలు ఒకదానికొకటి ఢ కొట్టాయని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి ఆపాయం జరగలేదని తెలిపారు. నేను నా సిబ్బంది క్షేమంగా ఉన్నట్టు ప్రకటించారు.