Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లిలో దిశ లైంగికదాడి నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టును అమికస్‌క్యూరీ డి.ప్రకాష్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌లకు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్. నంద డివిజన్ బెంచ్ ఆదేశించింది. దిశ ఎన్కౌంటర్ కేసును రాష్ట్ర హెకోర్టు విచారణ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైకోర్టు పైవిధంగా రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
ఫర్నీచర్ కాంట్రాక్టు టెండర్ల వివరాలివ్వండి
మన ఊరు-మన బడి కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నీచర్ కొనుగోళ్ల టెండర్‌ను సవాల్ చేసిన రిట్‌ను మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మే 9న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిందని వి3 ఎంటర్ప్రైజెస్ ప్రయివేటు లిమిటెడ్, జెనిత్ మెటఫాస్ట్ ప్రయివేటు లిమిటెడ్ హైకోర్టులో సవాలు చేశాయి. వీటిలో స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ వివరణ తర్వాత తగిన విధంగా స్పందిస్తామని మంగళవారం హైకోర్టు ప్రకటించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.