Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల
- నేటి నుంచి ఈనెల 15వ తేదీ లోగా కాలేజీల్లో చేరాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ ఫలితాలను mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు వెల్లడించారు. పరీక్ష ఫలితాలు, వారికి వచ్చిన మార్కులతో పాటు సీటు వచ్చిన కాలేజీ అడ్రస్, ప్రిన్సిపల్ నెంబర్ తో సహా సమాచారం వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ లోగా తమకు కేటాయించిన కళాశాల్లో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.