Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి (86) సోమవారం రాత్రి 2 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. గుడిపూడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సినీ విమర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వివరణాత్మక వ్యాసాలు రాసే రచయితగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈనాడులో 25 ఏండ్ల పాటు హరివిల్లు పేరుతో ప్రత్యేక శీర్షిక నిర్వహించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యం, ఇతర రంగాలలో అనేక మంది కళాకారులను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆల్ ఇండియా రేడియోలో ఎమ్.ఎస్.రామారావును పరిచయం చేశారు. 1968లో ప్రముఖ దినపత్రిక హిందూ, ఈనాడులతో తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. నాటి విలువలతో కూడిన పత్రికారంగంలో తనదైన అక్షర శోభతో ఉన్నతంగా ఎదిగిన గుడిపూడి శ్రీహరి లేని లోటు పూడ్చలేనిది.