Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
భూపాలపల్లి జిల్లాలో కొంత కాలంగా పెద్దపులి సంచరిస్తుందన్న ప్రచారం నిజమని అటవీశాఖ అదికారులు పులి పాదముద్రల ద్వారా ధ్రువీకరించారు. మల్హర్రావు మండలం కొయ్యుర్ అటవీశాఖ పరిధిలో కిషన్రావుపల్లి, శాత్రజ్పల్లి, ఎంచరామి, కాపురం, నాచారం మల్లన్న గుట్టల్లో, పెద్దతూండ్ల, భూపాలపల్లి వన్ ఇంక్లైంన్, రుద్రారం తదితర అటవీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలు గుర్తించినట్టు అటవీశాఖ ఇన్చార్జి రేంజర్ నరేష్ బస్వ తెలిపారు. అయితే మంగళవారం ఎడ్లపల్లి గ్రామపరిధిలో అడవిలో ఉన్న చిన్న తరహా బొగ్గులవాగు ప్రాజెక్టు పరిసరాల్లో సంచరిస్తున్నట్టుగా తెలిపారు. బొగ్గుల వాగు పరిసరాల్లో పశువుల కాపర్లు, ప్రజలు, రైతులు వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.