Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాకతీయుల చరిత్రను చాటి చెప్పేలా ఈ నెల ఏడు నుంచి 13 వరకు కాకతీయ వైభవ సప్తాహంను ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినరు భాస్కర్‌తో కలసి మంగళవారం హైదరాబాద్‌లో మంత్రుల కార్యాలయంలో ఆ కార్యక్రమాల బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంతరం మంత్రులతోపాటు భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.