Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం చేయుతనివ్వాలి: సీపీఐ(ఎం)
- రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-ఘట్కేసర్
ఇరుకిరుకు గదుల్లో నానా ఇబ్బందులు పడుతున్న నిరుపేదల ఇండ్ల వెడల్పు, కొత్త ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజి గూడ రాజీవ్ గృహకల్ప పరిధిలో పేదలు ఇండ్ల వెడల్పు కోసం పునాదులు తీసుకుంటున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఊదరగొడుతోంది తప్ప ఇవ్వడం లేదన్నారు. 58 జీవో ప్రకారం సొంత జాగా ఉంటే ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం రాజీవ్ గృహకల్పలోని 2800 కుటుంబాలకు ఎటువంటి సహాయం అందించలేదన్నారు. ఇక్కడి పేదల ఇండ్ల వెడల్పు కోసం, జాగాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహించామని చెప్పారు. పేదల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టి పేదల మధ్య అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు ఐక్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఆయన వెంట సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్. సబిత, గ్రామ శాఖ కార్యదర్శి బి. సునీత, నాయకులు అలివేలు, సిహెచ్. అరుణ, జి.నాగమణి, కే శోభ, కె.అరుణ, రాజేశ్వరి, మహేందర్ సింగ్ తదితరులు ఉన్నారు.