Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తహసీల్దార్ కార్యాలయ ప్రధాన రహదారిపై మంగళవారం ఆ కాలనీవాసులు బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, కో ఆప్షన్ సభ్యులు చోటామియ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రోగ్లు గుంతలమయంగా మారి వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటోందని, వాహనాలు నడవడానికి ఇబ్బందిగా ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఏ వీధికి పోయినా బురదమ యంగా రోడ్లు కనబడుతున్నాయన్నారు. ప్రతి రోడ్డులో నాట్లు వేసే విధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, వార్డు మెంబర్ మల్లేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్, జోడు ప్రదీప్, మౌల పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.