Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రావెల్ అండ్ టూరిజం షో ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కరోనా తర్వాత అంతర్జాతీయంగా మళ్లీ పర్యాటకరంగానికి పునర్వైభవం వస్తున్నదని యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారంనాడిక్కడి హెచ్ఐసీసీలో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ షోను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయనీ, వాటికి టూరిజం సంస్థలు మరింత ప్రచారాన్ని కల్పించాలని కోరారు. అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిం చడంలో ట్రావెల్, టూరిజం సంస్థలు చేస్తున్న కృషి గొప్పదని ప్రసంసించారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా తర్వాత తమ సంస్థ దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ తరహా పర్యాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు ఫెయిర్‌ఫెస్ట్ మీడియా లిమిటెడ్ సీఈఓ సంజీవ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పర్యా టకుల సంఖ్య క్రమేణా పెరుతున్నదని వివరించారు.