Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామంటూ ప్రభుత్వం పలుమార్లు ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు. టెట్ ఫలితాలు వచ్చినా టీఆర్టీ నోటిఫికేషన్‌పై ఎలాంటి ముందడుగు వేయడం లేదని విమర్శించారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.