Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నీట్ కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు భారతదేశంలో మొట్టమొదటి సమగ్రమైన ఆడియో బుక్ ఆడిప్రిప్ను ఆకాశ్ బైజూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ చౌదరి బుధవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ని ప్రస్తుతం నీట్ ఔత్సాహికుల కోసం మాత్రమే ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కరిక్యులమ్ భాగంగా ఉంటాయని వివరించారు. దీన్ని ప్రత్యేకంగా నిపుణులు తీర్చిదిద్దారని అన్నారు.