Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీ ప్రాంతాలన్నీ హరితమయం చేయ్యాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి చెప్పారు. ఎనిమిదో విడత హరితహారం పురోగతిపై రాష్ట్రస్థాయి పరిశీలన- సమన్యయ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో అటవీ, మున్సిపల్, సాగునీటి, పంచాయితీ రాజ్ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని సంబంధిత అన్ని శాఖలను కోరారు.