Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలిసికట్టుగా కొట్లాడదాం: రైతు బిడ్డ వీడియో వైరల్
నవతెలంగాణ - జహీరాబాద్
జాతీయ పెట్టుబడులు ఉత్పత్తు ల మండలి (నిమ్జ్) కోసం పంట భూములు ఇచ్చేది లేదని ఓ రైతు బిడ్డ చేసిన వీడియో ఆలోచింప జేస్తుంది. అది సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అవుతోంది. బాధిత రైతుల్లో స్ఫూర్తి నింపి ధైర్యంగా నిలిచేలా ఆ బాలిక మాట్లాడింది. జహీరాబాద్ నిమ్జ్ కోసం అధికారుల బలవంతపు భూసేకరణను వ్యతి రేకిస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ నిమ్జ్ రైతుల దయనీయ స్థితిపై ఒకటిన్నర నిమిషాల వీడియో రూపొందించింది. రైతులు భూము లు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్న ప్పటికీ అధికారులు మాత్రం సిద్ధమని ప్రక టించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూముల విక్రయాలు జరగ కుండా రిజిస్ట్రేషన్లు బ్లాక్ చేయడం, 3 పంటలు పండే భూములు పండవని చూపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫా ల్లో జరిగిన భూ బాధితుల సమావేశా ల్లో పాల్గొన్నానని, భవిష్యత్తులో జరిగే ఆందోళనల్లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. ఎకరా కోటి విలువ చేసే భూములను నాలుగైదు లక్షల విలువ కట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించింది. ప్రభుత్వం ఒత్తిడి ఒకవైపు, మరోవైపు బడాబాబులు వెంచర్ల హడావిడితో రైతులు ఆందో ళనకు గురవుతున్నారని.. కలిసికట్టు గా వాటిని ఎదుర్కొందామని, అంతి మ విజయం మనదేనని ఆమె వీడియో ద్వారా బాధిత రైతుల్లో ధైర్యం నింపారు.