Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. రూ.15 కోట్ల అమెరికన్ డాలర్లతో ఈ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటుచేస్తుంది. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ దేశంలో తన తొలి ఎంఆర్ఓ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలనుకున్న శాఫ్రాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా మని చెప్పారు.ఆ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తి చేసే శాఫ్రాన్ ప్రతిపాదిత కంపెనీతో సుమారు వెయ్యి ఉద్యోగాలు కల్పించబడ తాయని చెప్పారు. భారత్‌తో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్ లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందు బాటులో ఉందన్నారు. శాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతమిస్తున్నదని తెలిపారు. దిగ్గజ సంస్థ శాఫ్రాన్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగు లేదన్న సంగతి మరోసారి రుజువైం దని కేటీఆర్ చెప్పారు.