Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2 కోట్లు విరాళం ఐక్యత ఫౌండేషన్ నిర్వాహకులు రాఘవేందర్ రెడ్డి సుంకి రెడ్డి అందజేత
నవ తెలంగాణ-వెల్దండ
అమెరికా దేశంలో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్నారై , ఐక్యత ఫౌండేషన్ నిర్వాహకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి భారీ విరాళం అందజేశారు. అమెరికా దేశంలో అట్టహాసంగా జరుగుతున్న ఆటా మహాసభలకు వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ 2 కోట్లు విరాళంగా అందజేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆటా 17వ మహాసభలలో అతిథిగా పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి భారీ విరాళం అందజేసి మెగా డోనర్ గా చరిత్ర సృష్టించాడు. తెలుగు మహాసభల చరిత్రలో ఇదే అత్యధిక విరాళం ప్రకటించిన వ్యక్తిగా రాఘవేందర్ రెడ్డి చరిత్రలోకి ఎక్కాడు. రూ.2కోట్లు విరాళం అందజేసిన రాఘవేందర్ రెడ్డి ఆటా ప్రతినిధులు ప్రశంసల్లో ముంచెత్తారు. వాషింగ్టన్ డిసిలో జులై 1 నుంచి 3వరకు ఈ మహాసభలు జరిగాయి. రాఘవేందర్ రెడ్డి వెల్దండ మండలం చౌదరిపల్లితో పాటు పలు గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పాలమూరు కీర్తిని అమెరికాలో ఘనంగా చాటుతున్న సుంకిరెడ్డి 17వ ఆటా మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభలకు ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్ ను అతిధిగా తీసుకురావడంతో పాటు మెగా విరాళంతో సంచలనమయ్యారు. భారీ విరాళంతో ఆటా మహాసభల నిర్వహణకు సహకరించిన సుంకిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ఆటా అధ్యక్షులు భువనేష్ భుజాలా, కో- ఆర్డినేటర్ గౌతమ్ గోలి అభినందించారు.