Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా సీఎస్ అవకాశం ఇవ్వట్లేదనీ, మీరైనా ఒక్కసారి సీఎం, సీఎస్‌ను కల్పిస్తే తమ గోడును వెళ్లబోసుకుంటామని వీఆర్వో సంఘం జేఏసీ నేతలు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో వీఆర్వో సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ నేతలు ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, గౌతమ్కుమార్లకు వినతి పత్రం అందజేశారు. దయచేసి తమకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీశ్, కోచైర్మెన్ రవినాయక్, నూకల శంకర్, కన్వీనర్ వింజమూరి ఈశ్వర్, అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, వైస్ చైర్మెన్ ఆకుల రవీందర్, చింతల మురళి, సురేశ్‌బాబు, ప్రతిభ, పి.వెంకన్న, కార్యనిర్వాహక కార్యదర్శి పి.రమేశ్, బి.శ్రావణ్‌గౌడ్, జి.ఎల్లయ్య, శ్రీనివాస్ జేఏసీ నేతలు మాతృనాయక్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 22 నెలలు గడుస్తున్నా తమను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని వాపోయారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అనేకసార్లు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 22 నెలల నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో చనిపోయినటువంటి దాదాపు 200 మంది వీఆర్వోల కుటుంబాలు రోడ్డున పడ్డాయనీ, కుటుంబాన్ని పోషించుకోలేక ఏమి చేయాలో తోచని స్థితిలో బాధిత కుటుంబాలు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.