Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సాధికారతకు ప్రతీక
- రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్
- రుద్రమ మరణ శాసనం విగ్రహాన్ని సందర్శించిన గవర్నర్
నవతెలంగాణ- నకిరేకల్
కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమ దేవి అత్యంత ధైర్యస్థురాలని, తెలుగు జాతికి గర్వ కారణమని, ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తి దాయక మని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో రాణి రుద్రమదేవి మరణ వివరాలు తెలిపే శాసనం, విగ్రహాన్ని మంగళవారం గవర్నర్ సందర్శించారు. రుద్రమదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాణి రుద్రమ చరిత్ర ప్రాముఖ్యానికి నోచుకోలేదని, ఆమె చరిత్ర అందరికీ తెలి యాల్సిన అవసరముందని చెప్పారు. ఇంతటి చరిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో స్మారక కేంద్రం నిర్మించి, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలన్నారు. చందు పట్లను సందర్శించి గ్రామస్థులతో మాట్లాడి కాకతీయ పరి పాలకురాలు రాణి రుద్రమదేవికి నివాళులు అర్పిం చేందుకు వచ్చానని తెలిపారు. గ్రామ ప్రవేశం వద్ద కాకతీ య ప్రాముఖ్యతను తెలిపేలా స్వాగత ద్వారం నిర్మించాలని గ్రామస్థులు ఈ సందర్భంగా గవర్నర్ను కోరారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, డీపీఆర్వో శ్రీనివాస్, రాష్ట్ర పురావస్తు, వారసత్వ శాఖ నుంచి సహాయ సంచాలకులు బుజ్జి, ఆదిత్య శర్మ, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, నకిరేకల్ ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు, కమిషనర్ బాలాజీ, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.