Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫీజుల నియంత్రణ చట్టానికి విరుద్ధంగా డొనేషన్లు వసూలు చేస్తున్న ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలు వ్యవరిస్తున్నాయని విమర్శించారు. వాటిలో చేరుతున్న విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు డొనేషన్లు పేరుతో వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.