Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ వ్యవసాయ, ఆస్తి, ప్రాణ, పశు నష్టం జరగకుండా నివారించడంలో టీఆర్ఎస్ సర్కారు విఫలమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, చైర్మెన్ అన్వేష్ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రావాల్సిన వర్షాలు జులైలోనే పడ్డాయని తెలిపారు. ఇండ్లు కూలిపోయి ప్రజలు నష్టపోయారనీ, పత్తి, మొక్కజొన్న, సోయ మొక్కదశలోనే దెబ్బతిన్నాయనీ, ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించి ఆదుకోవాలనీ, కేంద్రం కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.11 మంది సభ్యులు నిరంతరం హైదరాబాద్ నుంచి వరద ప్రాంతా నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకుని అవసరమైన సహాయ చర్యలు చేపట్టనున్నారు.