Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య భవన్లో జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వరద పరిస్థితిని సమీక్షించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గర్భిణులను, కిడ్నీ బాధితులను ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, వరద ప్రాంతాల్లో వైద్య, విద్యుత్, తాగునీటి వసతులకు అవాంతరాలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశధ్య కార్యక్రమాలను నిర్వహించాలనీ, సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గిరిజన గురుకులాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తాగునీరు, ఆహారం, విద్యుత్ సౌకర్యాలు నిరంతరం విద్యార్థులకు అందేలా చూడాలని తెలిపారు. అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం టేక్ హోమ్ రేషన్ ద్వారా కొనసాగించాలని చెప్పారు. జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేసారు.
వికలాంగుల సాధికారిత ఆవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం
మెదక్ : వికలాంగుల సాధికారిత, జాతీయ ఆవార్డులు 2021-22 సంవత్సరానికి గాను దరఖాస్తులు, నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్టు వికలాంగుల సాధికారిత విభాగం, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ విజ్ఞప్తి చేసింది.