Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రైల్వే లైను పూర్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే బిసుగిర్షరీఫ్ - ఉప్పల్ మధ్య 20 కిలోమీటర్ల మేర విద్యుదీకరణతో సహా మూడో రైల్వే లైను పనులను పూర్తి చేసి ప్రారంభించింది. కాజీపేట-బల్లార్షా మూడో రైల్వే లైను విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు పూర్తి చేశారు. . దక్షిణ భారత దేశంతో ఉత్తర భారత దేశాన్ని అనుసంధానించే క్రమంలో కాజీపేట - బల్లార్షా మధ్య సెక్షన్ కీలకమైనది. ఈ సెక్షన్లో ఇప్పుడు 104 కిలోమీటర్ల మేర విద్యుదీకరణతో సహా మూడో రైల్వే లైను పనులు పూర్తయ్యాయి. ఈ సెక్షన్ తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లు నిరాటంకంగా సాగుతూ రద్దీగా ఉండే ఈ ప్రధాన రైల్వే లైను గ్రాండ్ ట్రంక్ మార్గంగా ఉంది. ఈ కీలక సెక్షన్లో రద్దీ నివారణకు తొలుతగా రాఘవాపురం - మందమర్రి మధ్య 33 కిమీల మేర మూడవ రైల్వే పనులు 2016లో పూర్తి అయ్యాయి. ఇక్కడ రవాణా మరింత సులభతరం కావడానికి కాజీపేట -బల్లార్షాలోని మిగిలిన భాగంలో 202 కి.మీల మేర (తెలంగాణలో 159 కి.మీలు, మహారాష్ట్రలో 43 కి.మీలు) మూడో రైల్వే లైను విద్యుదీకరణ పనులు రూ.2,063 కోట్ల అంచనా వ్యయంతో 2015-16లో మంజూరు చేయబడ్డాయి. ఇందులో భాగంగా పోట్కాపల్లి -రాఘవాపురం మధ్య 32 కి.మీలు, విరూర్-మానిక్ఘర్ మధ్య 19 కి.మీలు పనులు గతంలోనే పూర్తయినాయి.