Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హర్యానాలో ఈనెల 16 నుంచి 18 వరకు జరుగనున్న ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు గురువారం రైలులో బయల్దేరి హర్యానాకు వెళ్లారు. ఈ మహాసభల్లో దేశంలోని రవాణా రంగం, రవాణా కార్మికుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధి బృందంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి వీఎస్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు పీ.రవిందర్‌రెడ్డి, జిల్లా ఉపేందర్, పున్నెం రవి, రుద్రకుమార్, అజరు బాబు, జీఆర్ రెడ్డి, గీత, పద్మావతి, సుధాకర్, క్రిష్ణ, మల్లేశం,విజేందర్, రామయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు.