Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెండ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న శివశంకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణజ్యోతి, మల్లు లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అడపా శివశంకర్ బాబు హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగిగా పనిచేస్తూ ఎనిమిది మంది మహిళలను మోసం చేసి పెండ్లి చేసుకున్నాడని తెలిపారు. ఒకరికి తెలియకుండా మరోకరిని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేసి పెండ్లి చేసుకోవడం దుర్మార్గమని తెలిపారు. మాయమాటలు చెప్పి, ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మబలికి లక్షలరూపాయలు దోచుకుంటున్న శివశంకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.