Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియన్ ఎంబెడ్డెడ్ వ్యాల్యూ (ఐఈవీ) నివేదికను ఎల్ఐసీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. దీనిపై సమావేశంలో చర్చించింది. ఈ ఏడాది జనవరిలో సింగిల్ ఫండ్‌ను వేర్వేరు పార్ మరియు నాన్-పార్ ఫండ్లుగా విభజించడాన్ని ఆమోదించింది. ఈ మేరకు ఎల్ఐసీ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ విభజన ప్రభావం మార్చి 31 నాటికి ఫైనాన్షియల్స్‌లో ప్రతిబింబిస్తుంది. మార్చి 31 నాటికి ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఐఈవీ రూ. 5,41,492 కోట్లు (రూ. 5,414.9)గా నిర్ణయించబడింది. ఇది గతేడాది మార్చి 31 నాటికి రూ. 95,605 కోట్లు. అలాగే, గతేడాది సెప్టెంబర్ 30 నాటికి రూ. 5,39,686 కోట్లు. ఎల్ఐసీ చట్టంలోని మార్పల ప్రకారం నిధుల్లో విభజన కారణంగా సెప్టెంబర్ 30, 2021 నాటికి ఐఈవీ.. మార్చి 2021 నాటి ఐఈవీ కంటే అధికంగా ఉన్నది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 4,167 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి కొత్త వ్యాపారం (వీఎన్‌బీ) విలువ రూ. 7,619గా నిర్ణయించబడింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి వార్షిక ప్రీమియం సమానమైన (ఏపీఈ) రూ. 50,390 కోట్లు. ఏపీఈలో వ్యక్తిగత వ్యాపారం 70.59 శాతం, ఏపీలో గ్రూప్ వ్యాపారం 29.41 శాతం. అలాగే, వ్యక్తిగత వ్యాపారంలో , ఏపీఈ ఆధారంగా సమానమైన వ్యాపార వాటా 92.88 శాతం అయితే, మిగిలిన 7.12 శాతం నాన్-పార్ బిజినెస్ నుంచి వచ్చింది. మార్చి 21, 2022కి ఆర్ఓఈవీ (ఎంబెడెడ్ విలువపై రాబడి) 11.9 శాతం. గతేడాది మార్చిలో 36.9 శాతం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఫండ్.. పార్ మరియు నాన్-పార్ ఫండ్‌గా మార్చచబడింది.
మెదక్ జిల్లాలో శాఖ తెరిచిన బిఒఎం
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) మెదక్ జిల్లాలోని వనపర్తిలో నూతన శాఖను తెరిచింది. ఈ శాఖను ఆ బ్యాంక్ హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ ఆర్ జగన్ మోహన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్ కార్పొరేట్ ఫైనాన్స్ బ్రాంచ్ ఎజిఎం ఎన్‌విబి శ్రీనివాస్, మెదక్ పోస్టు మాస్టర్ వెంకటేశ్వర్లు, బిఒఎం సిబ్బంది పాల్గొన్నారు. ఈ నూతన శాఖతో తెలంగాణలో బిఒఎం శాఖలు 21 జిల్లాల్లో 43 శాఖలకు విస్తరించినట్లయ్యింది.