Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మక్తల్ నుంచి జుక్కల్ వరకు : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్ 2 నుంచి చేపట్టబోయే భారత్ జోడో యాత్ర తెలంగాణలో మక్తల్ లో ప్రవేశించి జుక్కల్ వరకు కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. జోడో యాత్రపై గురువారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ముక్కలు, ముక్కలుగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను మోడీ విధ్వంసం చేస్తున్న విషయాన్నీ, అనేక రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు సహా వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపేందుకు వీలుగా రాహూల్ ఈ యాత్ర చేపట్టబోతున్నారని తెలిపారు. దాదాపు 150 రోజులపాటు 3,600 కిలోమీటర్లు కొనసాగనున్న యాత్ర, తెలంగామ తర్వాత నాందేడ్లోకి ప్రవేశిస్తుందన్నారు. రాష్ట్రంలో యాత్రను అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పారు.