Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెండర్ ద్వారా విక్రయానికి ప్రతిపాదనలు :మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన రికార్డు స్థాయి ధాన్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్టోరేజీ స్పేస్ లేకపోవడంతో ఆరుబైట తడిసి ముద్దవుతుంది, ఈ ధాన్యం మరో పది రోజుల్లో పూర్తిగా పాడైపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని టెండర్ ద్వారా విక్రయించే ప్రతిపాదనలను సీఎంకు సమర్పించే అంశంపై గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. 'గత నెల ఏడో తారీఖునుండి కుంటి సాకులతో ఎప్.సి.ఐ రాష్ట్రం నుండి సీఎంఆర్ ప్రక్రియను నిలిపేసింది. తెలంగాణా రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యంపై కేంద్రం తన మొద్దు నిద్రను, బాధ్యతారాహిత్యాన్ని కొనసాగిస్తున్నది సీఎంఆర్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఎఫ్ సీఐ అధికారులకు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లైస్ శాఖ పదే పదే చేస్తున్న విజ్ణాపనలను కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని టెండర్ ద్వారా విక్రయించాలనే ప్రతిపాదనలపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక సమర్పించాలని నిర్ణయించాం...' అని మంత్రి తెలిపారు.