Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్ బ్యూరో
కాళేశ్వరంఅసాధారణ వర్షపాతం వలన గోదావరి, దాని ఉపనదుల్లో వచ్చిన వరదలు 100 ఏండ్లకు ఒకసారి వచ్చేవి. ఇది ప్రకృతి విపత్తుగా పరిగణించాలని సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నేపల్లి పంప్హాజ్లు నీట మునిగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఎత్తిపోతల పథకాల్లో, జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లు నీట మునగడం అతి సాధారణమని వెల్లడించారు. గతంలో మనరాష్ట్రంలో 1998,2008లో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు రెండు సార్లు నీట మునిగిందన్నారు. అదేవిధంగా కల్వకుర్తి పంప్‌హౌస్ సైతం రెండు పర్యాయాలు మునిగిందని వివరించారు. అయితే స్వల్పకాలంలోనే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వరద ఉధృతి తగ్గిన అనంతరం నీటిని తొలగించి తిరిగి మోటర్లను ఆరబెట్టి వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు. ఎల్రక్టిక్ / ఎలక్ట్రానిక్ పరికరాలను కొత్తవి మార్చుకోవాల్సి ఉంటుందన్నారు.