Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలివ్వడమే..
- తీర్పు వెలువరించిన జిల్లా న్యాయస్థానం
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతిపై జిల్లా న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. ఎన్నికల అఫిడవిట్లో సంతాన వివరాలు తప్పుగా నమోదు చేశారంటూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
తెలకపల్లి మండల జెడ్పీటీసీగా 2019లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన పెద్దపల్లి పద్మావతి కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రపై విజయం సాధించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే, పద్మావతికి ముగ్గురు పిల్లలుంటే ఇద్దరే ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం నమోదు చేశారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా ఎలక్షన్ ట్రిబ్యునల్ కోర్టు పూర్వాపరాలు పరిశీలించి సుదీర్ఘ విచారణ చేశారు. చివరకు పద్మావతిని అనర్హురాలిగా ప్రకటిస్తూ జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి శీతల్ తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది. పార్టీ పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడింది. తాను మూడేండ్లుగా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, కోర్టు తీర్పు తనకు నిరాశ కలిగించిందని జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి అన్నారు. స్థానిక కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.