Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉషోదయ సూపర్ మార్కెట్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. యుగంధర్
- ఈస్ట్ మారేడ్‌పల్లిలో 'ఉషోదయ సూపర్ మార్కెట్' నూతన (25వ) స్టోర్ ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్
ఉన్నత వ్యాపార విలువలతో .. కస్టమర్ల ఆదరణను చూరగొన డమే లక్ష్యంగా ముందుకు సాగే ప్రతి వ్యాపార సంస్థా.. చక్కని పురోభివృద్ధి సాధిస్తుందని, తమ ఉషోదయ సూపర్ మార్కెట్ ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ అని 'ఉషోదయ సూపర్ మార్కెట్' వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. యుగంధర్ అన్నారు. ఈస్ట్ మారేడ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ నూతన 25వ స్టోర్‌కు గురువారం హైదరాబాద్ నగర నార్త్ జోన్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ చందనా దీప్తి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే హెచ్డీఎఫ్సీ హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్, సౌత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ చౌదరి స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో యుగంధర్ మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో హైదరాబాద్‌లోని ఏఎస్రావు నగర్లో తమ ఉషోదయ సూపర్ మార్కెట్ తొలి స్టోర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కొద్ది కాలంలోనే కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొని, వారి ఆదరాభిమానాలే సోపానాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందామని అన్నారు. తమ నాణ్యత , నమ్మకం.. వాటితో లభించిన కస్టమర్ల ఆదరణతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని ఆయన వివరించారు. ప్రస్తుతం నూతనంగా ప్రారంభమైన ఈ స్టోర్.. తమ సంస్థకు 25వ స్టోర్ అని, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తమ స్టోర్లు ఉన్నాయని, అన్నీ విజయపథంలో పురోగమిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ల్యాండ్ లార్డ్ నంద కిషోర్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. హైదరాబాద్ నగర నార్త్ జోన్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ చందనా దీప్తి మాట్లాడుతూ.. నాణ్యత, నమ్మకాలకు మారుపేరైన ఉషోదయ సూపర్ మార్కెట్ సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజానీకం ఈ స్టోర్‌లో కొనుగోళ్లు చేసి నాణ్యమైన వస్తువులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన స్టోర్ ప్రారంభం సందర్భంగా.. సంస్థ ఎం.డీ యుగంధర్‌కు, స్టోర్ సిబ్బందికి ఆయన తన శుభాకాంక్షలు అందజేశారు.