Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని శ్రీశైలం రాఘాయిపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ అమ్మవారికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్మిస్తున్న ఆలయానికి గ్రామానికి చెందిన బండ బుచ్చిరెడ్డి, గోలి నర్సిరెడ్డిలు రూ.1లక్ష చొప్పున అందజేయగా, మెండే శ్రీను, శవ్వ వెంకటయ్య, శవ్వ రాములు, శవ్వ నరసింహ, పెంటయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మెండే కొండల్ రూ.51 వేల చొప్పున ఇవ్వగా, మిండే యాదయ్య రూ.20 వేల చొప్పున నగదు రూపంలో ఆలయ నిర్మాణానికి గోలి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. విరాళం అందజేసిన వారిని గోలి శ్రీనివాస్ రెడ్డి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అచ్చాలు రామస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, విజయ డైరీ చైర్మన్ మేండే కొండల్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు మేడే బాలయ్య, ఆమనగల్లు మార్కెట్ డైరెక్టర్ సుభాష్, తలకొండపల్లి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గుమ్మకొండ రాజు, వడ్డేమోని శివ, రవికుమార్, సుమన్, గోపి, రాయకంటి గిరి, సతీష్ వెంకటాచారి తదితరులు ఉన్నారు.