Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డేంజర్ జోన్లో భద్రాచలం
- భూపాలపల్లి, ములుగు జిల్లాలో రెడ్ అలర్ట్
- మునిగిన పలు గ్రామాలు
- పునరావాస కేంద్రాలకు తరలింపు
- చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
- 24 గంటలూ విధుల్లో పోలీసు, అధికార యంత్రాంగం
- మంథనిలో పసికందును బుట్టలో పెట్టి తరలింపు
- చెన్నూరులో హెలికాప్టర్ సహాయంతో ఇద్దరు కాపరుల తరలింపు
- మేడిగడ్డలో చిక్కుకున్న 17 మంది ఇరిగేషన్ అధికారులు
నవతెలంగాణ- యంత్రాంగం
వర్షం.. వరద ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది. ఎటు చూసినా వరదనే కనిపిస్తోంది. గురువారం కొంతమేర వర్షం తగ్గినా.. పై ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వల్ల ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి. గ్రామాలకు గ్రామాలే మునిగిపోయాయి.. ప్రాజెక్టులు, గోదావరి, చెరువుల పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. చెరువులు, రోడ్లు, పొలాలు తేడా లేనంతగా వరద ప్రవహిస్తోంది. రాకపోకలు బంద్ అయ్యాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు నీటిలో మునిగిపోయి కట్టుబట్టలతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. కరీంనగర్ జిల్లా మంథని పూర్తిగా మునిగిపోయింది. వరద నీటిలో నుంచి ఓ కుటుంబం పసికందును బుట్టలో పెట్టుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం గల్లంతైన ఇద్దరు రెస్క్యూ టీం సభ్యుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వరదల నేపథ్యలో పోలీసులు, అధికారులు 24 గంటలూ విధులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. చరిత్రలో రెండోసారి భద్రాద్రి వంతెనపై రాకపోకలు బంద్ చేశారు.
హాట్సాఫ్ పెద్దపల్లి పోలీస్
జోరువానలోనూ ప్రజలకు రక్షణగా 24/7 విధులు
ఓవైపు కుండపోత.. మరోవైపు హోరు గాలి.. ఇంకోవైపు రాజీవ్ రహదారి నుంచి పొంగి పొర్లుతున్న వరద నీరు.. వాటిని తొలగించి దారి ఇస్తేనే గమ్యానికి చేరే ప్రయాణికులు.. ఇలాంటి సమయంలో 'రక్షక భటులం.. మేమున్నాం' అంటూ రోడ్డుపైకి వచ్చారు.. ఏడు రోజులుగా భారీ వర్షాల వల్ల మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రాజీవ్ రహదారిపై పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. రహదారి మొత్తం నీటితో మునిగిపోగా, వాహనాలను మళ్లిం చి.. రెండు వైపులా వాహనాలను సురక్షితంగా పం పించే పనిలో 24 గంటలపాటు పోలీసులు శ్రమిస్తు న్నారు.వేమనపెల్లి మండలం కల్మలపేటకు చెందిన నిండు గర్భిణి నీల్వాయి బస్టాండ్ వద్ద వేచి చూస్తుండగా.. స్థానిక ఎస్ఐ నరేష్ ఆమెను ప్రభుత్వ వాహనంలోనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.
సహాయక చర్యలు :
- పెద్దపల్లి జిల్లా మంథని మర్రివాడలో వరదలో చిక్కుకున్న బాలింతను, ఆమె మూడు నెలల కొడుకును బుట్టలో పెట్టుకుని వరదనీటిని నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇంటెక్‌వెల్‌లో రెండ్రోజుల నుంచి ఏడుగురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అలక్ష్యంగా ఉండొద్దు: కేటీఆర్
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో జులైలో అత్యధిక వర్షం నమోదు అయిం దని, ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువగా వర్షపాతం కురిసిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉన్న అసాధారణ పరిస్థి తులు ఇక్కడ లేవని, అయిన్పపటికీ అధికారులు ఉదాసీనంగా, అలక్ష్యంగా ఉండకూడ దని సూచించారు. ఈ మేరకు రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వర్షాల ప్రభావ పరిస్థితులపై మంత్రి సమీక్షించారు. చెరువులు, డ్యాంల నుంచి నీటిని కిందికి విడుదల చేసే ముందు ప్రజలకి, పోలీస్, రెవెన్యూ వంటి ఇతర శాఖల ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్‌ను వీడని వరద ముప్పు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరద ముంపు వీడటం లేదు. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు వరద ముంపు లోనే ఉండి పోయాయి. కడెం ప్రాజెక్టుకు గురువారం వరద ముప్పు తప్పిందని తెలుస్తోంది. ఎగువ నుంచి వరద నీటి ఉధృతి తగ్గడంతో ప్రాజెక్టు ప్రమాదకర స్థితి నుంచి బయటపడింది. ప్రస్తుతం 18గేట్ల నుం చి నీరు దిగువకు వెళ్తోంది. కడెం గ్రామం వరద నీటిలోనే ఉంది. చెన్నూర్ మండలం సోమనపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇద్దరు గోదావరి వరదలో చిక్కుకున్నారు. భయంతో సమీప ంలోని నీటిట్యాంకు ఎక్కారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ హెలికాప్టర్ రప్పించి వారిని రక్షించారు.
-దహెగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన గర్భిణి అల్లకొండ సరస్వతిని ఆస్పత్రికి చేర్చ డానికి వచ్చి వరద ప్రమాదంలో గల్లంతైన మంద మర్రికి చెందిన రెస్క్యూ టీం సభ్యులు సతీష్, రాములు మృతదేహాలు గురువారం లభ్యమ య్యాయి. సింగరేణి నుంచి వచ్చిన రెస్క్యూ టీం బృందం వారి మృతదేహాలను బయటకు తీసింది.
ఎస్సారెస్పీ 36 గేట్ల ద్వారా నీటి విడుదల
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరామసాగర్ ప్రాజె క్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధ వారంతో పోల్చితే గురువారం ఇన్‌ఫ్లో తగ్గింది. గతంలో 4 లక్షల క్యూసెక్కు లకుపైగా ఇన్‌ఫ్లో రాగా.. ప్రస్తుతం 2,55,985 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు నుంచి 2,49,850 క్యూసె క్కుల నీటిని 36 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు లో 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
రెడ్ అలర్ట్
- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రక టించారు. ములుగు జిల్లా కన్నాయి గూడెం సమీపంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటి ఉధృతి కొనసాగుతు ండటంతో కలెక్టర్ క్రిష్ణ ఆదిత, ఐటీడీఏ పీఓ అంకిత్ సంద ర్శించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగపేట మండలం లోని నర్సింహసాగర్ పరిసర గ్రామా లు నీటమునిగాయి. ఇండ్లలోకి భారీగా నీరు చేరింది. పాకాల వాగు అలుగు పోస్తోంది. పలిమెల పోలీస ్‌స్టేషన్ నీట మునగడం తో పోలీసు లు కూడా సురక్షిత ప్రదేశానికి వెళ్లా రు. ములుగు జిల్లా ఏటూర ్నాగా రం మండలం రామన్న గూడెం వద్ద గోదావరి నీటిమట్టం 17.360 మీట ర్లకు చేరడంతో ఉదయం మూడో ప్రమాద హెచ్చ రికను జారీ చేశారు. వెంకటాపురం-భద్రాచలం వయా చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంక టాపురం మండలంలో 8 పంచాయతీలు జలమయమయ్యా యి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వ రం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. సమ్మక్క బ్యారేజీ పూర్తిగా నిండింది. కాటారం మండం దామరకుంట, లక్ష్మీపేట్ గ్రామాలను మానేరు వరద చుట్టుముట్టింది. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు మైక్‌ల్లో ప్రచారం చేస్తు న్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద విధి నిర్వహణలో వున్న 17 మంది ఇరిగేషన్ అదికారులు గోదావరి వరదలో చిక్కుకుపోయారు. భూపా లపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మహదేవ్పూర్ మండల కేంద్రంలో మకాం వేసి వరద పరిస్థితిని సమీక్షి స్తున్నారు. కలెక్టర్‌తోపాటు కాటారం డిఎస్పీ బోనాల కిషన్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండలంలో 7 గ్రామాలు మునిగిపోయాయి.
డేంజర్ జోన్లో భద్రాద్రి
వరద బీభత్సంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మన్యం అత్యంత డేంజర్ జోన్లోకి వెళ్లి పోయింది. వారం రోజులుగా కురు స్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొగింది. ఊహించని రీతిలో ఏజెన్సీ జలప్రళయంలో చిక్కుకుంది. భద్రా చలం పట్టణం వద్ద 62 అడుగులు దాటి.. మరింత పెరిగి 70 అడుగుల కు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం ప్రకటించింది. భద్రా చలం రెవెన్యూ డివిజన్ పరిధిలో 59 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తరలించారు. ఇండ్ల చుట్టూ వర ద చేరింది. భద్రాద్రి వంతెనపై రాక పోకలు నిలిపివేశారు. దీంతో మూడు రాష్ట్రాలకు రాకపోకలు బందయ్యా యి. భద్రాచలం, బూర్గం పాడులో 144 సెక్షన్ విధించారు. బూర్గం పాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజరుకుమార్, కలెక్టర్ అనుదీప్ సందర్శించారు.