Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతకు నైపుణ్యం అందించేందుకు కృషి :
- జైమఖ్తల్ ట్రస్టు అధ్యక్షుడు సందీప్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం (వరల్డ్ యూత్ స్కిల్ డే)ను పురస్కరించుకుని జైమక్తల్ ట్రస్ట్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ అధ్యక్షులు సందీప్ కుమార్ మక్తల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మక్తల్ నియోజకవర్గంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన హైదరాబాద్‌లోని టీహబ్ వేదికగా స్కిల్ మక్తల్ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మెమొరీ ఎక్స్పర్ట్ శాలివాహన శ్రీనివాస్, తెలంగాణ నిక్ అవార్డు గ్రహీత లింగప్ప పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో యువత చాలా మంది యువత ఉపాధి లభించక సతమతమవుతున్నారని సందీప్‌కుమార్ అన్నారు. వారికి వివిధ రంగాల్లో నైపుణ్యం అందించి వారిని స్కిల్డ్ యూత్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. మక్తల్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ మీద పూర్తి ఉచితంగా శిక్షణ అందించామన్నారు. వారికి బహుళజాతి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సైతం కల్పించామని అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కంప్యూటర్ విద్యతో ఉచితంగా కోడింగ్ శిక్షణ అందించి, వారే సొంతంగా వీడియో గేమ్‌లు తయారుచేసే స్థాయికి తీసుకొచ్చామని అన్నారు. ఇక మల్టీ మీడియా రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేలా లక్షల విలువ చేసే యానిమేషన్లో యువతకు ఉచితంగా శిక్షణ అందజేస్తున్నట్టు వివరించారు. ఎడవెల్లి గ్రామంలోని అంగన్వాడీ చిన్నారులకు కృత్రిమ మేథ ఆధారిత టీవీని అందించి, వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యం పెంపొందిస్తామని అన్నారు.