Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు https://pecet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. ఇప్పటి వరకు బీపీఈడీకి 1,574 మంది, డీపీఈడీకి 1,098 మంది కలిపి 2,672 మంది దరఖాస్తు చేశారని వివరించారు.